Son Killed Father over Property Disputes : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో ఓ బాలుడు కన్న తండ్రినే హతమార్చాడు. అనంతరం ఆ శవాన్ని మాయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించి.. చివరకు కటకటాల పాలయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లికి చెందిన గుమ్మడి తిరుపతి (48), రాజమణి దంపతులకు 17 ఏళ్ల కుమారుడు ధనుంజయ్ ఉన్నాడు. అనారోగ్యం కారణంగా తల్లి రాజమణి ఏడాదిన్నర క్రితం మృతి చెందగా.. ధనుంజయ్ తండ్రితో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు. ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు.
బీమా కథా చిత్రమ్.. డబ్బు కోసం తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపేశాడు
Son kills Father in Bhupalapally District : అయితే గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంతో సరిగా పని చేయలేని స్థితిలో ఉన్న తిరుపతి.. తనకు ఉన్న ఏడెకరాల పొలాన్ని కౌలుకు ఇచ్చాడు. 7వ తరగతిలోనే చదువు మానేసి జులాయిగా తిరుగుతున్న కుమారుడి ప్రవర్తన కారణంగా.. పంట భూమి పాసు పుస్తకాలను తన చెల్లెలి వద్ద దాచాడు. దీంతో కక్ష పెంచుకున్న బాలుడు తరచూ తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆవులను విక్రయించగా వచ్చిన సొమ్మును ఇవ్వాలని ధనుంజయ్ అడగగా.. తండ్రి అందుకు నిరాకరించాడు. దీంతో మరింత కోపం పెంచుకున్న కుమారుడు.. నాన్నను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూశాడు. ఆ సమయం రానే వచ్చింది. ఈ నెల 16న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి తిరుపతి తలపై రాడ్డుతో కొట్టి.. మెడకు తాడు బిగించి చంపేశాడు. అనంతరం శవాన్ని ఓ దుప్పటిలో చుట్టి ఇంట్లోనే ఓ మూలన పడేశాడు.
రూ.3,000 కోసం తండ్రిని చంపి ఆరు ముక్కలుగా చేసిన కుమారుడు!
ఏం తెలియనట్లుగా..: తండ్రి శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని రెండు రోజులు ఏం తెలియనట్లుగా గడిపేశాడు. దుర్వాసన వస్తుండటంతో మరో 2 రోజుల పాటు తెలిసిన వారి ఇళ్లల్లో తలదాచుకున్నాడు. తండ్రి తనకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లాడని గ్రామస్థులకు చెప్పాడు. బంధువులకు ఫోన్‌లు చేస్తూ.. నాన్న గురించి ఆరా తీస్తుండటంతో గ్రామస్థులూ నిజమే అనుకున్నారు. అయితే మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన ఎక్కువ కావడంతో శనివారం అర్ధరాత్రి మద్యం సేవించి.. తన బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లి గ్రామ సమీపంలోని చెరువులో పడేసి వచ్చాడు. ఆదివారం ఉదయం చెరువులో తిరుపతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. అనుమానంతో ధనుంజయ్‌ను ప్రశ్నించగా చేసిన నేరం అంగీకరించాడు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న భూపాలపల్లి డీఎస్పీ రాములు, సీఐ రాం నరసింహారెడ్డి, ఎస్సై శ్రవణ్‌లు విచారణ చేపట్టారు. చెరువులోని మృతదేహాన్ని వెలికి తీసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తండ్రిని హత్య చేసిన కుమారుడు.. రంపంతో ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో..