జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లిలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. చలి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మంటల వేడితో కాస్త వెచ్చబడుతున్నారు. కేవలం పెద్దవాళ్లే కాకుండా చిన్నారులు కూడా మంట వద్దకు వెళ్లి చలి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వెట్టర్లు, దుప్పట్లు సైతం చలిని ఆపలేకపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు.
ఇవీ చూడండి: అన్నదాతల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో తెలంగాణ