జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో ఏఎంఆర్ ప్రైవేట్ కంపెనీ చేపడుతున్న ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని సోమవారం సింగరేణి పనులను ఎంపీపీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. అయితే జెన్కో సంస్థకు భూములు, పంట పొలాలు, ఇళ్లు ఇచ్చిన గ్రామ ప్రజల ఆశలు అడియాసలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాల్లోని యువతకు ఏఎంఆర్ ఓపెన్ కాస్ట్‌లో ఉపాధి కల్పించాలని, ఇతరులకు ఉపాధి కల్పిస్తూ స్థానిక యువత పొట్ట కొడుతున్నారని ఆందోళన చేపట్టారు. 49 ఇళ్లకు పరిహారం చెల్లించాలని ఎంపీపీ మల్హర్రావు డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వకుండా యాజమాన్యం కాలయాపన చేస్తూ నిర్వాసితులను మోసం చేస్తుందన్నారు.
సంఘటనా స్థలానికి ఎస్సై సత్యనారాయణ చేరుకొని భూనిర్వాసితులు, యాజమాన్యంతో చర్చలు జరిపి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో నిర్వాసితులు ఆందోళనను విరమించారు.
ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?