Pranahita Pushkaralu: త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కర వేడుక ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తజనం.. నదిలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లన్నీ బాగున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో గుంటూరు, రాజమండ్రి నుంచి అధికంగా తరలివచ్చారు. ఇప్పటివరకూ ప్రతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ వస్తున్నామని భక్తులు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 12 రోజుల పాటు(ఏప్రిల్ 24 వరకు) ప్రాణహిత పుష్కరాలు కొనసాగనున్నాయి.
ఇవీ చదవండి: PRANAHITHA PUSHKARALU: ప్రాణహిత పుష్కరాలకు శ్రీకారం..
600 ఏళ్ల నాటి దేవతల విగ్రహాలు స్వాధీనం.. విలువ ఎంతంటే?
'రాజ్యాంగాన్ని అందించిన మహనీయున్ని అవమానించిన ఘనత కేసీఆర్‌దే..'