మరణించిన పోలీసు కుటుంబాలకు.. జిల్లా పోలీసు సిబ్బంది చేయూత నివ్వడం అభినందనీయమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇటీవల జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ హెడ్ కానిస్టేబుల్ ఎట్టి ఎర్రయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భార్య లక్ష్మికి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్థిక చేయూత కింద రూ. 50వేల చెక్కును శ్రీనివాసులు అందజేశారు.
దివంగత పోలీసు కుటుంబ సభ్యుల పరిస్థితిపైన ఆరా తీసిన అదనపు ఎస్పీ.. వారిని అధైర్య పడొద్దని ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమను సంప్రదించాలని సూచించారు. అర్హులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌ను త్వరగా వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను డీపీవో అయూబ్ ఆదేశించారు.
ఇదీ చదవండి: బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన మంత్రులు కొప్పుల, నిరంజన్‌రెడ్డి