CPR To Person Who Suffered Cardiac Arrest In Bhupalapally: ఈ ఊరుకులు పరుగుల ఆధునిక జీవితంలో.. మారుతున్న జీవన శైలిలో.. శరీరానికి విశ్రాంతి అన్నదే లేకుండా పోతుంది. కంటి నిండా నిద్ర పోకపోవడం.. సమయం ప్రకారం భోజనం చేయకపోవడం.. వ్యాయామం చేయకపోవడంతో మానవ శరీరంలోని గుండె పైనే దీని భారం పడుతుంది. దీంతో గుండె ఉన్నట్టుండి ఆగిపోవడం వంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ కార్డియాటిక్ అరెస్ట్ అనే వలయంలో చిక్కుకుంటున్నారు. ప్రముఖులు నుంచి సాధారణ ప్రజలవరకు అందరికీ గుండె పనితీరు ఉన్నట్టుండి ఆగిపోవడం అనే చూస్తూనే ఉన్నాము. కొవిడ్ తర్వాత ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. యుక్త వయస్సులో ఉన్న వారికి కూడా సడెన్ స్ట్రోక్ వస్తుంది.
Constable Administered CPR To Person Who Had Cardiac Arrest: గత నెలలో జిమ్ చేస్తూ కానిస్టేబుల్ ఉన్నట్టుండి కిందపడిపోయి.. చనిపోయాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత బస్ స్టాండ్‌లో నిల్చున్న వ్యక్తి ఉన్నట్టుండి.. గుండె పనితీరు ఆగిపోవడంతో కింద పడిపోయి.. ప్రాణాపాయస్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే ఆవ్యక్తికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా సడెన్‌గా గుండె ఆగిపోవడంతో ఏడాదికి సుమారు 15 లక్షల మంది ఇలానే మరణిస్తున్నారని నివేదికలు చెప్పుతున్నారు. అయితే భూపాలపల్లి జిల్లాలో కార్డియాటిక్ అరెస్ట్ వచ్చి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ నిర్వహించి రేగొండ పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లిలో రేగొండ మండల పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో చికెన్ సెంటర్లో పనిచేసే వంశీ అనే వ్యక్తి హార్ట్ ఎటాక్ వచ్చి అక్కడికక్కడే కూలిపోయాడు. దీంతో పక్కనే ఉన్న బ్లూ కోల్డ్ పోలీస్ సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే పోలీస్ సిబ్బంది, కాసిస్టేబుల్ కిరణ్ ఆ వ్యక్తికి సీపీఆర్ నిర్వహించారు. దాదాపు 15 నిమిషాలు అలాగా సీపీఆర్ చేయడంతో.. ఆ వ్యక్తి శ్వాస తీసుకోకున్నాడు. తర్వాత ఎస్సై శ్రీకాంత్ రెడ్డి వాహనంలో కార్డియాటిక్ అరెస్ట్ వచ్చిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతనిని తీసుకొని వెళ్లడానికి మిగిలిన సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ట్రాఫిక్‌ను రెగ్యులేషన్ చేశారు. అయితే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన వ్యక్తిని చూసి.. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని.. ప్రజలు అభినందించారు.
సీపీఆర్ ఎలా చేయాలి: కార్డియో పలమరీ రీససిటేషన్ను సీపీఆర్ అంటారు. గుండె పనితీరు ఉన్నట్టుండి ఆగిపోయినప్పుడు.. వెంటనే వేరే వ్యక్తి తన రెండు చేతులతో గుండె దగ్గర అదిమినప్పుడు వెంటనే గుండెకు ఆక్సిజన్‌ను పంప్ చేసేందుకు దోహదపడుతుంది. ఇలా చేయడం వల్ల ఆక్సిజన్‌ను గుండెకు పంపింగ్ చేస్తూ.. అదే సమయంలో ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను గుండెకు పంపింగ్ చేస్తుంది. దీనినే సీపీఆర్ అంటారు. ఒక క్రమపద్ధతిలో రెండు చేతులను ఒకదానిపై ఒకటి పెట్టి గట్టిగా క్రమపద్ధతిలో అదిమితే మనిషి ప్రాణాపాయస్థితి నుంచి బయటపడవచ్చు.
ఇవీ చదవండి: