ETV Bharat / state

సింగరేణిలో ఉద్రిక్తత.. కార్మికుల ధర్నా - jayashankar bupalapally news

సింగరేణి ఏరియా కేటీకే మొదటి గనిలో ఉద్రిక్తత నెలకొంది. విధులు ముగించుకోని ఇంటికి వెళ్తున్న తమను పోలీసులు కొట్టారంటూ కార్మికులు ధర్నాకు దిగారు. గంట పాటు మేనేజర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

police beet singareni employee
సింగరేణిలో ఉద్రిక్తత.. కార్మికుల ధర్నా
author img

By

Published : Mar 31, 2020, 10:18 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఏరియా కేటీకే మొదటి గని కార్మికులు ఆందోళనకు దిగారు. తమ కార్మికులను పోలీసులు కొట్టారంటూ సింగరేణి అధికారులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ముక్కెర రవి అనే కార్మికుడు సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసులు కొట్టారని ఆరోపించారు. అత్యవసర రంగంలో పనిచేస్తున్న తమకు భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. దాదాపు గంట పాటు మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

కార్మికులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. విధులకు హాజరయ్యే వారికి మాస్క్​లు, గ్లౌజులు పంపిణీ చేయాలన్నారు. సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు వివరించామని సింగరేణి అధికారులు తెలిపారు.

ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. విధులకు హాజరయ్యేవారు ఏకరూప దుస్తులు ధరించాలని కోరారు. బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

ఇవీ చూడండి: గంటలో వైరస్‌ల నిర్మూలన.. సరికొత్త యంత్రం ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.