ETV Bharat / state

Pranahitha pushkaralu: సండే ఎఫెక్ట్.. భక్త జనసంద్రంగా మారిన ప్రాణహిత నదీ తీరం

author img

By

Published : Apr 18, 2022, 5:20 AM IST

Updated : Apr 18, 2022, 6:32 AM IST

Pranahitha pushkaralu: ప్రాణహిత నదీ తీరం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. బారులు తీరి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Pranahitha pushkaralu: సండే ఎఫెక్ట్.. భక్త జనసంద్రంగా మారిన ప్రాణహిత నదీ తీరం
Pranahitha pushkaralu: సండే ఎఫెక్ట్.. భక్త జనసంద్రంగా మారిన ప్రాణహిత నదీ తీరం
సండే ఎఫెక్ట్.. భక్త జనసంద్రంగా మారిన ప్రాణహిత నదీ తీరం

Pranahitha pushkaralu: ప్రాణహిత నదీ తీరం ఆధ్యాత్మిక చింతనతో పులకించిపోతోంది. ఐదో రోజు పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట, వేమనపల్లి.. కుమురం భీం జిల్లా తుమ్మిడిహెట్టి, మహారాష్ట్రలోని సిరోంచ పుష్కరఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పితృ దేవతలకు పిండ ప్రదానాలు నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని అధికారులు అంచనా వేశారు.

కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్క రోజే.. లక్ష మందికి పైగా ఆలయా‌న్ని సందర్శించారు. పూజలు, ప్రసాదాల ద్వారా రూ.6.92 లక్షల ఆదాయం సమకూరింది. కాళేశ్వరంలో నదీమాతకు రోజుకో హారతిలో భాగంగా ఆదివారం సప్త హారతినిచ్చారు. శ్రీహనుమదీక్షా పీఠం, మహాలక్ష్మి ట్రస్టు ఆధ్వర్యంలో పంచహారతి, మహాహారతి అందించారు. పుష్కర స్నానం ఎంతో పవిత్రమని.. సర్వపాపాలు హరిస్తుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్​పై అభిమానం..

ప్రాణహిత పుష్కరాల్లో తెరాస కార్యకర్తలు.. కేసీఆర్​పై అభిమానం చాటుకున్నారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి.. పుష్కర జలాలతో స్నానం చేయించారు. వరంగల్‌కి చెందిన తెరాస నాయకులు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో చిత్రపటాన్ని ఎడ్లబండిపై ఊరేగింపుగా త్రివేణి సంగమానికి తీసుకువచ్చారు.

ఇవీ చూడండి..

pranahitha pushkaralu: ప్రాణహిత పుష్కరాల్లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. నేడు మరింత పెరిగే ఛాన్స్​

'భారత్​లో తొమ్మిదేళ్లలో భారీగా తగ్గిన పేదరికం'

Last Updated : Apr 18, 2022, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.