ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ములుగు జిల్లా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ భాస్కరన్ ప్రారంభించి బాధ్యతలు చేపట్టారు. ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ సీతారామ్ నాయక్, మాజీ మంత్రి చందూలాల్, శాసనసభ్యురాలు సీతక్క, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయాన్ని కొత్త కలెక్టరేట్‌గా మార్చి అందంగా ముస్తాబు చేశారు. ములుగు జిల్లా అంతటా శిలాఫలకాలు దర్శనమిచ్చాయి.