జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 13 మంది లబ్ధిదారులకు అందజేశారు. తెరాస పార్టీ 2020 క్యాలెండర్ను ఆవిష్కరించారు. దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి నుంచి వైద్య ఖర్చులు అందిస్తామన్నారు.
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. సొంత డబ్బులతో వైద్యం చేసుకున్న వాళ్లకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 3 లక్షల 44 వేల 500 రూపాయల చెక్కులను అందజేశారు. 2019లో అనుకున్న స్థాయిలో వర్షాలు పడ్డాయన్నారు. 2020లో కూడా మంచి వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని అన్నారు.
ఇదీ చూడండి : చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..