భూపాలపల్లి నియోజక వర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ.. ప్రజలకు అండగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు,కాంట్రాక్టర్లతో గండ్ర సమీక్ష నిర్వహించారు.
ఇప్పటి వరకు గ్రామాల్లో ఎంత మేర పనులు జరిగాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే జరగాల్సిన అభివృద్ధి పనులపై చర్చించి... రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు,కాంట్రాక్టర్లును ఎమ్మెల్యే ఆదేశించారు.