జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘ కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రైతులు తగు జాగ్రత్తలు వహించాలని పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. రైతు సోదరులు కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దని.. దళారుల చేతులో మోసపోవద్దని కోరారు. రైతుల వద్ద నుంచి ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
అనంతరం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఆయన అరా తీశారు. ప్రజలకి నాణ్యమైన వైద్యసేవలు వెనువెంటనే అందించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి: కరోనా ఉన్మాదం: దుకాణంలో సరకులను నాలుకతో..