ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పెళ్ళి రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెరాస జిల్లా నాయకులు బుర్రా రమేశ్ ఆధ్వర్యంలో.. భూపాలపల్లి కేంద్రంలోని ఓ వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం జరిగింది.
రమేశ్.. ఎమ్మెల్యే దంపతులతో కేక్ కట్ చేయించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం.. ఆశ్రమంలో అన్నదానం చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత.. ఎమ్మెల్యేకు దక్కుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గాలి ద్వారా కొవిడ్ వైరస్.. జాగ్రత్తగా ఉండాలన్న డీహెచ్