జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ నాయకుడని కొనియాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎన్నో సేవలందించారని పేర్కొన్నారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. తెరాస ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశానికి ఎనలేని సేవలు అందించిన పీవీకి భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు