జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తెరాస నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో మాస్కులను పంపిణీ చేసిన అనంతరం మొక్కలను నాటారు. వృద్దులకు అన్నదానం చేశారు. భూపాలపల్లి పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేశారు.
అదే విధంగా వృద్ధాశ్రమానికి పదివేల రూపాయల విరాళం అందజేశారు. భూపాలపల్లి ప్రజల తరఫున కల్వకుంట్ల తారక రామారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు : మంత్రి తలసాని