ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెరాస పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. అందుకు తగినట్లుగా వారికి సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడాా రాష్ట్రంలో అమలు కాలేదని మంత్రి ఆరోపించారు.
తీన్మార్ మల్లన్న, కోదండరాం వీళ్లంతా భాజపాకు తొత్తుగా పనిచేస్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి క్యాంపులు ఏర్పాటు చేసి.. పట్టభద్రులకు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధిపై అవగాహన కల్పించాలని ఎర్రబెల్లి సూచించారు. మిగిలిన వాగ్ధానాలను త్వరలోనే అమలు చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి త్వరలోనే వస్తుందని హామీ ఇచ్చారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, పార్టీ నేతలు రాజయ్య యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: న్యాయవాదుల రక్షణ చట్టం కోసం కృషి చేస్తా: ఉత్తమ్