జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుందూర్ పల్లె ఏఎస్ఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అధ్యక్షతన ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి, ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు పాల్గొన్నారు. పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకోవాలని మంత్రులు తెలిపారు. రైతును రాజును చేయడానికి సీఎం కేసీఆర్ నిరంతర కృషి చేస్తున్నారని వారు అన్నారు.
ఇదీ చూడండి. 'పోలింగ్ బూత్ల వద్ద అధికార పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడింది'