గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ప్రతీ ఊరిని సొంతంగా భావించి అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సూచించారు.
విడివిడిగా...
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హెడ్ క్వార్టర్స్‌ను మెయింటైన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని, శానిటేషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరుగా సేకరించి సెగ్రిగేట్ చేయాలని తెలిపారు.
సమర్థవంతంగా...
హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలను ముందస్తుగా గుర్తించి వాటిని నర్సరీల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు సమర్థవంతంగా జరిగేలా చూడాలని తెలిపారు.
చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా... సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా చూడాలి. గ్రామ అభివృద్ధి పనుల్లో కార్యదర్శుల ముఖ్య పాత్ర ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ అధికారులకు అందుబాటులో ఉండి పనిచేయాలి.
-కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్
ఇదీ చూడండి: అన్నదాతలు ఆర్థికంగా ఎదగాలి : సబితా ఇంద్రారెడ్డి