ఎంపీడీవో కార్యాలయం ముందు ఎన్నికల విధుల కోసం ఏర్పాటు చేసిన 5 టెంట్లు, కుర్చీలు దగ్ధమైన సంఘటన జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా గణపురంలో చోటు చేసుకుంది. ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మరో ద్విచక్ర వాహనం, ఓ కారు స్వల్పంగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : విద్యుదాఘాతంతో కాలి బూడిదైన ఇల్లు