జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లో మావోలు ఒక వ్యక్తిని చంపేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో అతడిని కాల్చి చంపారు. ఇప్పపూలు కోయడానికి భార్యతో కలిసి వెళ్తున్న అతడిని గుర్తించిన మావోలు.. కొంత దూరం తీసుకెళ్లి కాల్చివేశారు. బుధవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆహెరి తాలూక రేపనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కమలాపూర్-లింగంపల్లి రహదారి, వంతెన పనులు చేస్తున్న నాలుగు వాహనాలు, జిమ్మలగట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దేచిలిపేట-కిష్టాపూర్ వంతెన పనులు చేస్తున్న ఒక ట్రాక్టర్, రెండు మిక్సర్ మిషన్లు, జనరేటర్‌ను మావోయిస్టులు తగలబెట్టారు. కరోనా నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి పనులు చేయవద్దని గుత్తేదార్లను పోలీసులు హెచ్చరించారు. పోలీసుల ఆజ్ఞలను పట్టించుకోకుండా పనులు కొనసాగించారు. ఇదే అదునుగా మావోలు విధ్వంసానికి పాల్పడ్డారు.
తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వరుస ఘటనలు, మావోల కదలికలు నేపథ్యంలో మహదేవపూర్ ప్రాంత పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేసి నిఘా పెంచారు.
ఇవీచూడండి: ఈనెల 17లోగా వేతనాలు, పెన్షన్ల కోతపై వివరణ ఇవ్వండి'