జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ -కాళేశ్వరం రహదారిలో అన్నారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కాళేశ్వరం నుంచి మహాదేవ్పూర్కు వెళ్తున్న ఇసుక లారీ... ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుడు చెల్పూరుకు చెందిన పనగంటి సమ్మయ్యగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు ప్రయాణికులు తెలిపారు.
ఇవీ చూడండి: వాతలు వచ్చేలా కొట్టిన సైకో టీచర్