ETV Bharat / state

జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా: కలెక్టర్​ కృష్ణా ఆదిత్య - భూపాలపల్లి వార్తలు

భూపాలపల్లి జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని నూతన కలెక్టర్​ కృష్ణా ఆదిత్య అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన పల్లె ప్రకృతి వనాలు, షెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

bhupalapally collector
జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా: నూతన కలెక్టర్​ కృష్ణా ఆదిత్య
author img

By

Published : Nov 11, 2020, 9:30 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని కలెక్టర్ కృష్ణా ఆదిత్య అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కలెక్టరేట్​కు వచ్చారు. నూతన పాలనాధికారికి.. అదనపు కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్​ సిబ్బంది పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

సిబ్బంది అంతా అంకితభావంతో పనిచేసి జిల్లా అభివృద్ధిలో భాగం పంచుకోవాలని కలెక్టర్​ కృష్ణ ఆదిత్య సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన పల్లె ప్రకృతి వనాలు, షెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను, ఖాళీల వివరాలను, వివిధ కార్యక్రమాల ప్రగతి వివరాలను అందించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్​లో వివిధ సెక్షన్ల, అధికారుల ఛాంబర్​లను పరిశీలించారు. కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నాగపద్మజ, జిల్లా సంక్షేమ అధికారి శ్రీదేవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శైలజ, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి సునీత, మైనార్టీ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, డీపీఆర్ఓ రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, సూపరింటెండెంట్​లు శ్రీనివాసరావు, రవికుమార్, సిబ్బంది, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సింగరేణి జీఎం నిరీక్షన్ రాజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: డిసెంబరు నుంచి విద్యాలయాలు తెరుచుకోనున్నాయ్​ !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.