ETV Bharat / state

Konda Surekha Injured : బైక్‌ నుంచి అదుపుతప్పి కిందపడిన కొండా సురేఖ.. ఆసుపత్రికి తరలింపు - తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర 2023

Konda Surekha Injured : రాహుల్ గాంధీ బస్సుయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. భూపాలపల్లిలో బైక్‌ ర్యాలీలో పాల్గొన్న కొండా సురేఖ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

konda surekha
konda surekha
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 3:02 PM IST

Updated : Oct 19, 2023, 7:07 PM IST

Konda Surekha Injured in Jayashankar Bhupalapally District : కాంగ్రెస్ నేత, మాజీమంత్రి కొండా సురేఖకు (Konda Surekha) ప్రమాదం తప్పింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం వద్ద రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ నిర్వహించిన ద్విచక్రవాహన ప్రదర్శనలో పాల్గొని సురేఖ గాయలపాలయ్యారు. సురేఖ నడుపుతున్న స్కూటీని మరొకరు ఢీ కొట్టడంతో.. ఆమె కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో తలకు చేతికి, కాలికి గాయలయ్యాయి.

Revanth Reddy Meets Singareni Workers : 'సింగరేణి ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి'

వెంటనే కొండా సురేఖను హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుని ఆమె కుమార్తె.. ఇతర కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రమాదంపై కొండా సురేఖ స్పందించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లానని చెప్పారు. తాను స్కూటీని నడుపుతున్నానని తెలిపారు. ఈ క్రమంలో వెనకనుంచి మరో బైక్ వచ్చి.. తన స్కూటీని ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా కింద పడిపోయానని అన్నారు. ఈ ప్రమాదంలో తనకేమీ కాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. రెండు రోజుల్లో ప్రచారంలో పాల్గొంటానని ఆమె వివరించారు.

Konda Surekha Injured బైక్‌ నుంచి అదుపుతప్పి కిందపడిన కొండా సురేఖ ఆసుపత్రికి తరలింపు

"రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లాను. నేను స్కూటీని నడుపుతున్నాను. వెనకనుంచి మరో బైక్ వచ్చి స్కూటీని ఢీ కొట్టింది. దీంతో కింద పడిపోయాను. ఈ ప్రమాదంలో నాకేమీ కాలేదు. దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దు." - కొండా సురేఖ, కాంగ్రెస్ నేత

భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించామని.. కానీ రాష్ట్రంలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో.. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. కేసీఆర్‌ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని.. దేశంలోనే అవినీతి ప్రభుత్వం ఇక్కడ ఉందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.

Rahul Gandhi Fires on BRS and BJP : బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) ఒక్కటేనని.. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంటే.. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీ పెట్టి.. కమలం పార్టీ సహకరిస్తోందని రాహుల్ ఆరోపించారు. దేశంలో భారతీయ జనతా పార్టీ తెచ్చిన ప్రతి చట్టానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. నేడు దేశంలో ప్రజల సంక్షేమం కోసం.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్లమెంట్‌లో కులగణనపై తాను మాట్లాడినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

దేశంలో కేవలం ఐదు శాతం అధికారులు మాత్రమే బడ్జెట్‌ను నియంత్రిస్తున్నారని.. ప్రజలందరినీ పరిపాలనలో భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మోదీ, అదానీ మంచి స్నేహితులని.. అదానీ దేశంలో రూ.లక్షల కోట్లు అప్పు తీసుకున్నారని.. ఆయన తీసుకున్న అప్పులను బీజేపీ మాఫీ చేస్తోందని ఆరోపించారు. కానీ స్వయం ఉపాధి కింద మహిళలు తీసుకున్న రుణాలను మాత్రం ఎందుకు మాఫీ చేయదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

Rahul Gandhi Speech At Bhupalapally Bus Yatra : 'తెలంగాణతో గాంధీ కుటుంబానిది రాజకీయ బంధం కాదు.. ప్రేమానుబంధం'

Revanth Reddy Counter Tweet to KTR Tweet : 'కేటీఆర్ ట్వీట్​కు రేవంత్ కౌంటర్.. తెలంగాణకు అసమర్థుల పాలన ఇక అవసరం లేదు'

Last Updated : Oct 19, 2023, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.