జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మండలంలోని లక్ష్మీ పంప్‌హౌస్‌లో ఆరో పంపును పున:ప్రారంభించారు. మరమ్మతులు పూర్తి చేసి ఇప్పటికే ఐదు పంపులను పునరుద్ధరించారు. తాజాగా మరో పంపును కూడా ప్రారంభించారు. ఆరో పంపు కూడా పూర్తి సామర్థ్యంతో నీటిని ఎత్తిపోసినట్లు రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు.
గోదావరికి వచ్చిన భారీ వరదతో జులై 14న ఈ పంపుహౌస్ మునిగిపోయింది. పంపుహౌస్ రక్షణ గోడ కూలి వరద చేరడంతో పంపులు, మోటార్లు మునిగి తొలుత రక్షణ గోడను అధికారులు పునరుద్ధరించారు. అనంతరం నీటిని తోడివేసి మరమ్మతులు పూర్తి చేశారు.
ఇవీ చదవండి: