ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాణ్యమైన సేవలందిస్తూ.. అవసరమైన వైద్య పరీక్షలను తప్పకుండా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య.. జిల్లా వైద్యాధికారికి సూచించారు. రెండు నెలలకు సరిపడా అత్యవసర, సాధారణ మందులను నిల్వ ఉంచుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ పీహెచ్సీలలో నూతనంగా నియమితులైన ఫార్మసిస్ట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు.
మందుల స్టాక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య పథకాలు, ఆస్పత్రి సిబ్బంది.. ఇతర వివరాలన్ని రికార్డ్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని డాటాఎంట్రీ ఆపరేటర్లను ఆదేశించారు కలెక్టర్. మందులను, సెలైన్ బాటిళ్లను ఆస్పత్రి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా.. ఫార్మసీ గదిలోనే ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు.. డాక్టర్ మమత, డాక్టర్ ఉమాదేవి, పీహెచ్సీ వైద్యులు డాక్టర్ రవి, డాక్టర్ జైపాల్, డాక్టర్ గోపీనాథ్, జిల్లా డ్రగ్ స్టోర్ ఇంఛార్జ్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 181 కరోనా కేసులు, ఒకరు మృతి