ETV Bharat / state

కౌన్సిలర్ల నేతృత్వంలో.. పట్టణాభివృద్ధి

జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమావేశానికి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణాభివృద్ధి కోసం చేపట్టిన పనులను.. త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

jayashankar bhupalapalli collector attends muncipal council meeting
కౌన్సిలర్ల నేతృత్వంలో.. పట్టణ అభివృద్ధి
author img

By

Published : Jan 31, 2021, 7:49 AM IST

కౌన్సిలర్ల నేతృత్వంలో.. పట్టణంలో వార్డుల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వాహణకు చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సింగరేణి ఇల్లందు క్లబ్​హౌస్​లో.. మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకటరాణి అధ్యక్షతన జరిగిన మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

పట్టణంలో.. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్​. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సదరన్ క్యాంపులు నిర్వహించి దివ్యాంగులకు పింఛన్ వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ప్రార్థన మందిరాలకు సమీపంలో మాంసం దుకాణాలు ఉండకుండా చూడాలని వివరించారు. స్మశాన వాటికలకు అవసరమైన స్థలాన్ని తక్షణమే అందించాలని తహసీల్దార్​కు ఆదేశాలు జారీ చేశారు.

వార్డుల వారీగా తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తాం. వారు స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో పని చేస్తారు. పనుల వేగవంతానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మున్సిపల్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు నిబంధనల మేరకే జరిగేలా చూడాలి.

- కలెక్టర్

పట్టణ అభివృద్ధే అంతిమ లక్ష్యంగా అధికారులు పని చేయాలి. కౌన్సిల్ సమావేశానికి ముందే.. కౌన్సిలర్లకు పట్టణ అభివృద్ధిపై సమాచారం అందించాలి. వీధి వ్యాపారుల కోసం పట్టణంలో స్థలాన్ని కేటాయించాలి.

- ఎమ్మెల్యే

ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఆశోక్​, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ హరిబాబు, కౌన్సిలర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మీడియా పోరాటం అభినందనీయం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.