కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. అంతకంతకూ వరద ఉద్ధృతి పెరుగుతోంది. వరదతో కాళేశ్వరం పంప్‌హౌజ్ నీట మునిగిపోయింది. పంప్ హజ్ లోకి క్రమంగా నీరు చొచ్చుకువచ్చింది. దీంతో.. పంప్ హౌజ్ లోని 17 మోటర్లూ నీటిలో మునిగాయి. 2టీఎంసీ, 1టీఎంసీ నీటిని తోడే ఈ పంపులు మునిగిపోయాయి. కంట్రోల్ రూం వరకూ వరద చేరుకోవడంతో.. పంప్ హౌజ్ ప్రమాద స్థాయికి చేరుకుంది.
వరద ఉద్ధృతి గమనించి.. పంప్ హౌజ్‌ను ఇంజినీర్లు ముందుగా ఖాళీచేశారు. నాలుగు రోజులుగా ఉద్ధృతి అధికంగా ఉన్నా.. నిన్నటినుంచి మరింత పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర వంతెన ఆనుకుంటూ గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ వద్ద ఉద్ధృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజీ కంట్రోల్ రూం, సీఆర్‌పీఎఫ్ క్యాంపు కార్యాలయాన్ని వరద చుట్టుముట్టడంతో.. ఇంజినీర్లు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. వరదల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
ఇవీ చూడండి: