ETV Bharat / state

KALESHWARAM: కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద... మేడిగడ్డ బ్యారేజి గేట్లు ఎత్తివేత - telangana varthalu

మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజిలో 39గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

KALESHWARAM: కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద

author img

By

Published : Jul 15, 2021, 11:14 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో కాళేశ్వరం బ్యారేజీలకు భారీగా వరద వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బ్యారేజీలకు భారీగా వరద పోటెత్తుతోంది.

39 గేట్లు ఎత్తివేత

మేడిగడ్డ బ్యారేజిలో 85 గేట్లకు గాను 39 గేట్లను ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 1,45,900 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా 39 గేట్ల ద్వారా 1,72,560 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ సామర్థ్యం 16 .17 టీఎంసీలకు గాను 13 టీఎంసీలకు నీటిని నిల్వ ఉంచారు.

లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా సరస్వతి బ్యారేజీకి నీటిని ఎత్తి పోయగా, పై నుంచి వరద ప్రవాహం ఉండడంతో ఎత్తి పోసిన నీటిని వదులుతున్నారు. అన్నారం బ్యారెజీకి ఎగువప్రాంతం నుంచి 45,000 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 20 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగువకు పంపిస్తున్నారు.

పార్వతి బ్యారేజ్ 20 గేట్లు ఎత్తివేత

గోదావరి నదికి అనుసంధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతి బ్యారేజ్ నుంచి 20 గేట్లను ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరిలో నీటి ఉద్ధృతి పెరిగింది. నెలరోజులుగా సరస్వతి పంపు హౌస్ నుంచి మోటార్ల ద్వారా నీరు ఎత్తిపోయడం.. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల వచ్చిన నీటితో పార్వతి బ్యారేజ్​ నిండుకుండలా మారింది. ఈ బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు. ప్రస్తుతం 6.757 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇదీ చదవండి: Irrigation Projects: భారీవర్షాలతో గోదావరిపై నిండుకుండలా ప్రాజెక్టులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.