singareni production stopped: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కురిసిన వర్షంతో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సింగరేణి కాలరీస్‌లోని ఓపెన్ కాస్ట్‌లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షంనీటితో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లో డంపర్, వోల్వో లారీలు బోల్తా కొట్టే అవకాశం ఉన్నందున సింగరేణి అధికారులు మొదటి షిప్ట్‌లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. సింగరేణి పరిధిలోని 4 చోట్ల వరద నీరు చేరినట్లుగా అధికారులు తెలిపారు.
వర్షం కారణంగా సుమారు కోట్ల రూపాయలల్లో నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేశారు. మోటర్ల ద్వారా వరద నీరును బయటకు పంపిస్తున్నారు. మొదటి షిప్ట్‌లో పనులు నిలిచిపోగా.. రెండో షిప్ట్ నుంచి ఉత్పత్తి ప్రారంభించారు. ప్రతిఏటా వర్షాలు భారీగా పడిన సమయంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి నిలిచిపోవడం పరిపాటిగా మారింది.
ఇవీ చదవండి: నిబంధనలు పాటించని సింగరేణి.. ఆపదలో జనావాసాలు