జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలోని భుగులోని గుట్టలో వెంకటేశ్వర జాతర కోలాహలంగా సాగుతోంది. భుగులోని జాతరను ఈ ప్రాంత ప్రజలు పండుగలా జరుపుకుంటారు. మరో తిరుపతిగా పేరుగాంచిన ఈ గుట్ట మీద... నాలుగు రోజుల పాటు ఈ జాతర వైభవంగా జరుగుతుంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లావాసులే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య