ETV Bharat / state

శ్రీశైలానికి భారీగా వరద... ఒక్క రోజులోనే 10 టీఎంసీల నీరు - srishailam project news

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయానికి ఒక్క రోజు వ్యవధిలో 10 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మరోవైపు నాగార్జునాసాగర్‌లో కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

heavy flow of water to srishailam project

author img

By

Published : Aug 10, 2020, 3:48 AM IST

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కృష్ణా నదిలోకి ఎగువ నుంచి వరద రాకతో జూరాల ప్రాజెక్టులో 28 గేట్లు ద్వారా లక్షా 98వేల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా మరో 22 వేల 743 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఒక్క రోజు వ్యవధిలోనే.. శ్రీశైలం జలాశయంలోకి 10 టీఎంసీల నీరు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలోనే... 14.21 టీఎంసీల మేర నీటి నిల్వ పెరిగింది.

శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీశైలంలో 79.81 టీఎంసీల నీరు ఉండగా... ఆదివారం సాయంత్రానికి 94.02 టీఎంసీలకు చేరుకున్నాయి. శ్రీశైలానికి 2లక్షల 13 వేల 486 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 40 వేల 259 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో ఉంది. తుంగభద్రకు కూడా భారీగా వరద వస్తుండగా... రెండు రోజుల్లో ఈ ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్ర నీళ్లు నేరుగా శ్రీశైలానికి చేరుకునున్నాయి. మరోవైపు నాగార్జునాసాగర్‌లో కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.