ETV Bharat / state

'డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అందించాలి' - Bhupalapalli Municipality Latest News

అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అందించాలని ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్య నారాయణ రావు డిమాండ్‌ చేశారు. తెరాస నేతల వ్యాపారం కోసమే ఇళ్ల పేరుతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతలతో కలసి ధర్నా నిర్వహించారు.

Gandra Satya Narayana Rao demanded that double bedroom houses be provided
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు అందించాలని గండ్ర సత్య నారాయణ రావు డిమాండ్‌
author img

By

Published : Dec 28, 2020, 9:43 PM IST

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు వెంటనే అందించాలని ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్య నారాయణ రావు డిమాండ్‌ చేశారు. తెరాస నేతల వ్యాపారం కోసమే ఇళ్ల పేర్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు.

హామీ ఏమయ్యింది?..

ఏఐఎఫ్‌బీ నాయకులతో కలసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ధర్నా నిర్వహించారు. భూములు తీసుకున్న 120 మంది నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రింగు రోడ్డు హామీ ఏమయ్యిందని ప్రశ్నించారు.

నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలి. అభివృద్ధి కోసం కాకుండా స్వప్రయోజనాలకే మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ పనిచేస్తున్నారు. నిరుపేదలకు న్యాయం జరిగే వరుకు పోరాటాలు చేస్తాం.

-గండ్ర సత్య నారాయణ, ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకులు

ఇదీ చూడండి: వచ్చే రెండేళ్లలో లింక్ రోడ్లు పూర్తి చేస్తాం: సీఎస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.