వృద్ధుడిపై అటవీ అధికారి దాడి ములుగు జిల్లా గోవిందరావుపేట చల్వాయి గ్రామానికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ జన్నారపు రాజు కుమార్ అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి మృతి చెందాడు. దహన సంస్కారాల కోసం ఓ వృద్ధుడు అడవి నుంచి కట్టెలు తీసుకురాబోయాడు. అది గమనించిన అటవీశాఖ అధికారి.. ఎందుకు తెచ్చావంటూ తిట్టడం మొదలు పెట్టాడు. దహనసంస్కారాల కోసమని చెప్పినా... వినిపించుకోకుండా గోడ్డలి కర్రతో కొట్టాడని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తెచ్చిన కర్రలను చిందరవందర చేసి వెళ్లిపోయాడని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:ముగ్గురిని మింగిన క్వారీ...