ETV Bharat / state

Rains effect: వర్షాలతో నీట మునిగిన పంటలు.. ఆవేదనలో అన్నదాతలు - తెలంగాణలో అన్నదాతల కష్టాలు

వర్షాలు మిగిల్చిన నష్టం అన్నదాతలకు కన్నీళ్లు తెప్పిస్తోంది. నీటమునిగిన పంటను చూసి తట్టుకోలేక జయశంకర్‌ జిల్లాలో ఓ రైతు అత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. రైతులు వేసిన పంటలు నీట మునగడంతో ఆవేదన చెందుతున్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ జలాలతో ఏటా నష్టపోతున్నామంటూ కర్షకులు పెద్దపల్లి జిల్లాలో ఆందోళన చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లాలోని పల్లెలు ఇంకా భారీ వర్షాల బీభత్సం నుంచి తేరుకోలేదు.

floods
వరదలు
author img

By

Published : Sep 29, 2021, 8:11 PM IST

రాష్ట్రంలో భారీ వర్షాలకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరదపోటెత్తుతోంది. వరద వల్ల వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లిలో... ఎల్లయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి, మిర్చి పంటలు నీటమునగడంతో అప్పులు తీర్చలేననే బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న రైతులు

న్యాయం జరగడం లేదు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల బ్యాక్‌వాటర్‌తో... పంటలు మునిగి నష్టపోతున్నామని అన్నదాతలు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీ కార్యాలయం వద్ద బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. మహదేవపూర్ మండలంలో సూరారం, అన్నారం, అంబట్‌పల్లి, చంద్రుపల్లి, మద్దులపల్లి, పలుగుల, కుంట్లము గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అన్నదాతలు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్తున్నా... తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు.

మా పొలాలు అన్నారం బ్యారేజీ దిగువన ఉన్నాయి. రెండోసారి రూ. లక్షన్నర పెట్టుబడి పెట్టి వరినాట్లు వేశాను. భారీ వర్షాలతో పంట నీట మునిగింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. బాధిత రైతు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

భారీ నష్టం

నిజామాబాద్‌ జిల్లాలోనూ వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. బోధన్ మండలం హాంగర్గలో పంటనష్టాన్ని అధికారులు అంచనా వేశారు. బాధిత ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ సహా ఇతర అధికారులు తొట్టిసాయంతో పర్యటించారు. శ్రీరాంసాగర్‌ నీళ్లు భారీగా రావడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని గ్రామస్థులు అధికారులకు తెలిపారు. నవీపేట్ మండలం యంచ నుంచి అల్జపూర్‌కు వెళ్లే రహదారిపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. రాకపోకలు నిలిచిపోయాయని... అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఆత్మహత్యాయత్నం

వేల్పూరు మండలం పచ్చల నడ్కుడాలో నాగమణి అనే రైతు ఆత్మహత్యాయత్నం చేసింది. తన పంట పొలం నీట మునగడంతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా... పక్కనే ఉన్న మిగతా రైతులు ఆమెను అడ్డుకున్నారు.

వరదకు కొట్టుకుపోయి..

రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్‌లో వరదలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితం భారీ వర్షాలకు కొత్తచెరువు అలుగు పోసింది. శాంతినగర్ మీదుగా వరద పోటెత్తింది. ప్రవాహంలో దినసరి కూలీగా పనిచేసే ఎర్రగుంట కిషన్ కొట్టుకుపోయాడు. రాత్రివేళ ఎవరూ గమనించలేదు. బైపాస్ పరిసర ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది.

పరిహారం అందలేదని..

బోయిన్ పల్లి మండలం నీలోజి పల్లి గ్రామానికి చెందిన అనుమల రాజయ్య.. మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 6 ఎకరాల పొలాన్ని పోగొట్టుకున్నాడు. పరిహారం కింద ప్రభుత్వం నుంచు రూ. 9లక్షలు రాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజయ్యను కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం పరామర్శించారు. రైతుకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వాలని కలెక్టర్​కు ఫోన్ చేసి కోరారు. వారం రోజుల్లో పరిహారం అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Rains effect on crops in telangana: పొలాల్లో చేరిన బ్యారేజీ బ్యాక్ వాటర్.. అన్నదాత కష్టం నీళ్లపాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.