జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతోంది. పెన్ గంగకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద పుష్కర ఘాట్ మెట్లను తాకుతోంది.
మేడిగడ్డకు ఎగువ ప్రాంతం నుంచి 5,62,500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడం వల్ల 65 గేట్ల ద్వారా వచ్చిన నీటిని విడుదల చేస్తున్నారు. సరస్వతి (అన్నారం) బ్యారేజికి 15,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండడం వల్ల 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.