దాహార్తితో వచ్చి.. కాలువలో పడ్డ దుప్పిలు - deer fell down in canal near kannepalli pumphouse
దాహార్తితో వచ్చిన నాలుగు దుప్పిలు ప్రమాదవశాత్తు గ్రావిటీ కాల్వలో పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి ప్రాంతంలో జరిగింది. అటవీ అధికారులు వాటిని తాళ్ల సాయంతో బయటకు తెచ్చారు. ఒకటి మరణించగా మరో మూడింటికి చికిత్స అందిస్తున్నారు.
![దాహార్తితో వచ్చి.. కాలువలో పడ్డ దుప్పిలు deer fell down in canal near kannepalli pumphouse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6490279-thumbnail-3x2-deer.jpg?imwidth=3840)
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి సరస్వతి బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోసే గ్రావిటీ కాల్వలో నాలుగు దుప్పిలు ప్రమాదవశాత్తు పడిపోయాయి. వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు కాల్వవద్దకు రాగా కెనాల్‌లో పడ్డాయి. స్థానికులు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు.
తాళ్ల సాయంతో బయటకు..
స్పందించిన ఫారెస్ట్ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని తాళ్ల సహాయంతో వాటిని బయటకు తీశారు. ఒక దుప్పి మరణించగా.. మరో మూడింటికి గాయాలయ్యాయి. వాటిని మహదేవపూర్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వాటిని అడవీలో వదిలేస్తామని డిప్యూటీ రేంజర్ సురేశ్ తెలిపారు.
ఇలా నిత్యం వన్యప్రాణులు దాహార్తి కోసం వచ్చి ప్రమాదానికి గురవుతున్నాయని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. కెనాల్ ప్రాంతంలో వన్యజీవుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు