ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలతో పొలాల్లో వరద పోటెత్తడం వల్ల పంటలన్నీ నీటిపాలయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావటం వల్ల వాగులు, వంకలు ఉప్పొంగి పంటలను ముంచేశాయి.
జిల్లాలో వర్షాకాలం 96 వేల ఎకరాల వరి సాగు, 121 ఎకరాల పత్తి సాగు చేస్తున్నారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిశాయి. 70 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు కావటం వల్ల పంట పొలాలు నీట మునిగాయి. 25 వేల ఎకరాల పత్తి, 8500 ఎకరాల్లో వేసిన వరికి నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యం తెలిపారు. జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నామన్నారు.