ETV Bharat / state

జయశంకర్ భూపాలపల్లిలో కంటైన్​మెంట్ జోన్లు

రెండో దశలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వైరస్​ను కట్టడి చేయడానికి మళ్లీ కంటైన్​మెంట్ జోన్లను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా కేసులు నమోదవుతోన్న పలు ప్రాంతాలను.. కంటైన్​మెంట్ ప్రాంతాలుగా ప్రకటిస్తూ కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు.

Containment zones in Jayashankar district
కంటైన్మెంట్ జోన్లు
author img

By

Published : Apr 21, 2021, 10:06 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్లుగా గుర్తించారు అధికారులు. కరోనా కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి చేపడుతున్న చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

కంటైన్​మెంట్ ప్రాంతాలివే..

భూపాలపల్లి పట్టణంలోని కార్ల్ మార్క్స్​ కాలనీ, సుభాశ్​ కాలనీ, క్రిష్ణ కాలనీ, జవహర్ నగర్ కాలనీ, నాగారం, మహదేవపూర్ మండలంలోని అన్నారం, మహాముత్తారం మండలంలోని నిమ్మగూడెం, కాటారం మండలంలోని జాదవరావుపేట్, గంగాపూర్(గుండ్రాతిపల్లి).. గ్రామాల్లో రేపటి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు కలెక్టర్​ తెలిపారు.

కంటైన్​మెంట్ జోన్లలో ప్రజలు బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. వైద్యసేవలు, నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఆయా ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజ్​ చేయాలని సూచించారు. ప్రజలంతా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి అంతా సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: వచ్చే నెల నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.