బక్రీద్ పండుగ సందర్భంగా గోవధను ప్రభుత్వం నిషేధించిందని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ ప్రకటనలో తెలిపారు. కుల మతాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో ఆనందంగా బక్రీద్‌ను జరుపుకోవాలని సూచించారు.
జిల్లాలో గోవులు, ఒంటెలను వధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా జిల్లాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.
ఇది చదవండి: ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక