ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న భూ సేకరణను వేగవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. భూ సేకరణ వల్ల ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలను మరొకసారి సర్వే చేసి వారికి పునరావాసం కల్పించాలని సూచించారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో ఆయన సమిక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
వచ్చే నెల 23 లోగా...
భూపాలపల్లి, మల్హర్రావు, ఘనపూర్ మండలాల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా శాఖల ఆధికారులను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే నెల 23 తేదీలోగా పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
విమర్శలు ఉండొద్దు..
ఎలాంటి విమర్శలకు తావులేకుండా బాధితులకు లబ్ధి చేకూర్చాలని స్పష్టం చేశారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణకు సంబంధించి గ్రామాల వారిగా పూర్తి వివరాలతో రికార్డులను భద్రపరచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీఓ శ్రీనివాస్, జెన్కో సీఈ సిద్దయ్య, తహసీల్దార్లు, సింగరేణి అధికారులు, కాలేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ఇంజనీర్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దా'రుణ' యప్లకు దూరంగా ఉండండి:ఆర్బీఐ