ETV Bharat / state

గోదారమ్మ చెంతకు... అపర భగీరథుడు

జలకళ సంతరించుకున్న మేడిగడ్డ బ్యారేజీని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పులకించారు. నిండుకుండలా  బ్యారేజీ కనబడుతోందంటూ హర్షం వ్యక్తం చేశారు. గోదావరి అద్భుత జీవనదిగా సాక్షాత్కరిస్తోందని పేర్కొన్నారు. జోరు వర్షాన్ని లెక్కచేయక బ్యారేజీని ముఖ్యమంత్రి పరిశీలించారు.

గోదారమ్మ చెంతకు... అపార భగీరథడు
author img

By

Published : Aug 6, 2019, 8:08 PM IST

Updated : Aug 6, 2019, 11:05 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాణహిత నుంచి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద వస్తున్న దృష్ట్యా... గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తర్వాత తొలిసారిగా సందర్శించిన సీఎం కేసీఆర్ జలాశయాల వద్ద నీటి నిల్వను స్వయంగా పరిశీలించారు. విహంగ వీక్షణం ద్వారా గోదావరి పరవళ్లను చూసి పులకించిపోయారు.

గంగమ్మకు పూజలు

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అధికారులు, ఇంజినీర్లతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలుత మేడిగడ్డ బ్యారేజికి చేరుకున్నారు. మేడిగడ్డ వద్ద వర్షపు జల్లుల్లోనే బ్యారేజీపై కాలినడకన పర్యటించారు. వారం రోజులుగా ప్రాణహిత, గోదావరి నదుల ద్వారా వస్తున్న వరద నీరు, ప్రస్తుత బ్యారేజీ నీటి మట్టాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 32 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న వరద ప్రవాహాన్ని సీఎం వీక్షించారు. గోదావరి మాతకు పూజలు నిర్వహించి... పూలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. గోదావరి జలాల్లో నాణాలు విడిచారు. ఆ తర్వాత అధికారులు, ఇంజినీర్లతో కలిసి విహంగ వీక్షణం చేశారు.

అప్పుడు వెలవెల... ఇప్పుడు బిరబిర

జలకళ సంతరించుకున్న మేడిగడ్డ బ్యారేజీని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పులకించిపోయారు. నిండుకుండలా బ్యారేజీ కనబడుతోందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎండాకాలంలో బ్యారేజీ నీటిలో నడిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు సహా పారిశ్రామిక అవసరాలు, 80 శాతం రాష్ట్రానికి తాగునీటిని అందించే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తిచేసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. బ్యారేజీ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

ఇది ఇంజినీరింగ్ అద్భుతం

మేడిగడ్డ బ్యారేజీ వ్యూ పాయింట్‌ వద్ద సందర్శకులు వీక్షించేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు మేడిగడ్డ నుంచి కిందికి ఎంత వరద వెళ్లిందని అధికారులను ఆరా తీశారు. 300 టీఎంసీలు వెళ్లినట్లు అధికారులు వివరించారు. పైనుంచి వచ్చే వరదకు అనుగుణంగా గేట్లను ఎత్తాలని... వీలున్నంత వరకు నీటిమట్టం కొనసాగించాలని పేర్కొన్నారు. గోదావరిలో మొత్తం వరద తగ్గాక గేట్లు మూసేయాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీని సకాలంలో నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థను, నీటిపారుదలశాఖ అధికారులను అభినందించారు. ఇటీవల నిర్వహించిన యాగశాల వద్దకు చేరుకుని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు.

నర్సన్న సన్నిధిలో...

మేడిగడ్డ నుంచి హెలికాఫ్టర్​లో గోలివాడ పంపుహౌస్‌ సమీపంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ధర్మపురి ఆలయానికి వచ్చిన సీఎంకు... అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహస్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండింతులు ఆశీర్వచనాలు అందించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం వెంట మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.

గోదారమ్మ చెంతకు... అపర భగీరథుడు

ఇవీచూడండి: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

sample description
Last Updated : Aug 6, 2019, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.