ETV Bharat / state

సింగరేణి ఓపెన్​కాస్ట్ మూసేశారు

సింగరేణి భూపాలపల్లి ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 11 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సేవలు అందించిన గనిని మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీని నుంచి దాదాపు 9.28 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీశారు.

ఓపెన్​కాస్ట్​ గని మూసివేత
author img

By

Published : Mar 11, 2019, 1:17 PM IST

ఓపెన్​కాస్ట్​ గని మూసివేత
భూపాలపల్లి ఏరియాలోని ఉపరితల బొగ్గు గని-1 ప్రస్థానం ముగిసింది. ఇక్కడ ఇదే తొలి ఉపరితల గని కావటం విశేషం. 2008లో మొదలైన ఈ గనిలో ఇప్పుటి వరకు ఉత్పత్తి నిరంతరాయంగా సాగింది. విలువైన ఈ, ఎఫ్ గ్రేడ్ బొగ్గును వెలికి తీసి కేటీపీపీ విద్యుత్తు కేంద్రానికి అందించింది.

విస్తరణ...ఈగని133.38 హెక్టార్లలో విస్తరించింది. 600 మీటర్ల లోతు వరకు ఇక్కడ తవ్వకాలు జరిపారు. 320 మంది ఉద్యోగులు శ్రమించి 11 ఏళ్లపాటు 9.28 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీశారు. బొగ్గుతోపాటు దాదాపుగా 981 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని బయటకు తీశారు. జీఆర్​ఎన్ కంపెనీ ఈ గనిని నిర్వహించింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు పలుమార్లు ఓపెన్​కాస్ట్​ గనిని మూసివేయాలని అందోళనలు చేశారు. జనాల నిరసనలకు తోడు గని జీవితకాలం దృష్ట్యా అధికారులు ఓపెన్​కాస్ట్​ను మూసివేస్తున్నమని వెల్లడించారు.

ఇవీ చూడండి:నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.