ETV Bharat / state

మల్లారం ఘటనపై విచారించనున్న భాజపా బృందం - మల్లారం ఘటన వార్తలు

భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామానికి చెందిన రాజబాబు అనే ఎస్సీ యువకుడి హత్యపై భాజపా నిజనిర్ధరణ కమిటీ వేసింది. తెరాస నాయకులు అన్యాయంగా హత్య చేశారని ఆరోపించింది. తమ బృందం బుధవారం మల్లారం గ్రామాన్ని సందర్శించి వాస్తవాలపై భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కి నివేదిక ఇవ్వనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.

bjp logo
bjp logo
author img

By

Published : Jul 28, 2020, 10:55 PM IST

భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామానికి చెందిన రాజబాబు అనే ఎస్సీ యువకుడిని తెరాస నాయకులు అన్యాయంగా హత్య చేశారని.. దీన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, నిజనిజాలు తెలుసుకోనేందుకు పార్టీ ప్రతినిధి బృందం మల్లారం గ్రామాన్ని సందర్శించి వాస్తవాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, ఎమ్మెల్యే రాజా సింగ్, వివేక్ వెంకటస్వామి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో కూడిన ప్రతినిధి బృందం బుధవారం ఉదయం మల్లారం గ్రామానికి వెళ్లనున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.