రాష్ట్ర ప్రజలు మంచి పరిపాలన పొందాలంటే భాజపా అధికారంలోకి రావాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దొంగల రాజేందర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని సుభాశ్ కాలనీలో ఆయన పర్యటించారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని దొంగల రాజేందర్ కోరారు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్న ఆయన.. తెరాస నేతలకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓటర్లు గుర్తుకు వస్తారని ఆరోపించారు. కేసీఆర్ సర్కారుకు ఈ ఎన్నికల్లో పట్టభద్రులు సరైన బుద్ధి చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తాండ్ర హరీశ్, సిరోజు సాగర్, ఆచారి, సముద్రాల రాజకుమార్, మాయా, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది'