ETV Bharat / state

పందెం కోళ్లకు మంచి డిమాండ్​... పోలీస్​స్టేషన్​లో వేలం - Bet chickens auction latest news

సంక్రాతి సందర్భంగా పట్టుకున్న పందెం కోళ్లకు భలే డిమాండ్ ఏర్పడింది. కోళ్లను పక్షం రోజుల పాటు పోలీసు నిర్బంధంలో పెట్టడం... ఆ తర్వాత వేలం వేయటం.. ఆసక్తికరంగా మారింది. గ్రామస్థులు సైతం వేలంలో మొదటిసారి పాల్గొనగా... ధర కూడా బాగా పలికింది. ఒక కోడి ధర రూ.600కు ప్రారంభమై రూ. 1800 పలకడం విశేషం. మొత్తం మూడు కోళ్లకు రూ. 3400 ఆదాయం సమకూరింది.

Bet chickens auctions in koyyuru police station

author img

By

Published : Jan 31, 2021, 2:47 PM IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం కొయ్యూరు పోలీసులకు వింత పరిస్థితి ఎదురైంది. సంక్రాంతి సందర్భంగా పట్టుకున్న పందెం కోళ్లను వేలం వేయాలని జిల్లా న్యాయస్థానం ఆదేశించటం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 14న కోడి పందాలు జరుగుతున్నాయన్న సమాచారంతో... తాడిచెర్ల శివారులోని దేశబందం ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. మూడు కోడి పుంజులు, 22 మోటార్ సైకిళ్లతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన మిగతా వ్యక్తుల కోసం గాలిస్తూ... పట్టుకున్న కోళ్లకు సంబంధించిన సమాచారాన్ని పెద్దపల్లి జిల్లా మంథని కోర్టుకు అందజేశారు.

దాదాపు 15 రోజలుగా కోళ్లను సంరక్షించేందుకు నానాతంటాలు పడిన పోలీసులు... కోర్టు ఆదేశాల మేరకు కోళ్లకు వేలం నిర్వహించారు. వేలంలో ఎనిమిది మంది గ్రామస్థులు పాల్గొన్నారు. కిలోకు రూ.300ల చొప్పున ధర నిర్ణయించారు. ఒక కోడి ధర రూ.1800 పలకగా... మిగతా రెండు రూ.950, రూ. 650 చొప్పున పలికాయి. ఈ వేలం వల్ల రూ. 3400 ఆదాయం సమకూరినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆమె సేవలకు గుర్తింపు..జాతీయ పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.