జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి గ్రామ శివారులో కూలీల ఆటో బోల్తా పడింది. అడ్డుగా వచ్చిన పామును తప్పించబోయిన ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న మొగుళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.
ఇవీ చూడండి : తల్లి మరణం తట్టుకోలేక.. కుమారుడి సెల్ఫీ ఆత్మహత్య