కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని కృష్ణ కాలనీ, అంబేద్కర్ మైదానంలోని వారాంతపు కూరగాయల సంతను ఆయన సందర్శించి... ధరలపై వివరాలు తెలుసుకున్నారు. కరోనా నివారణకు తన వంతుగా ఒక నెల జీతం ఇస్తానని... మునిసిపాలిటీ పాలకవర్గమంతా ఒక నెల జీతం సీఎం సహాయ నిధికి ఇస్తారని తెలిపారు. ప్రజలకు నిత్యావసర సరకులకు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:- ఎయిమ్స్ వైద్యుడు, గర్భిణి భార్యకు కరోనా