ETV Bharat / state

consumer commission: గేదె బీమా కోసం కమిషన్​ను ఆశ్రయించిన మహిళ

పాల వ్యాపారంపై ఆధారపడిన ఓ దివ్యాంగురాలు.. తన గేదెకు బీమా చేయించారు. గేదెకు బీమా కోసం ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. ప్రసవ సమయంలో గేదె మరణించింది. కానీ బీమా సొమ్ము చెల్లించేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ(national insurance company) నిరాకరించింది. తనకు న్యాయం చేయాలని ఆమె వినియోగదారుల కమిషన్‌(consumer commission)ను ఆశ్రయించింది. వినియోగదారుల కమిషన్ ఏం చెప్పిందో ఈ కథనంలో చూద్దాం.

A woman approached the Consumers Commission for buffalo insurance
consumer commission: గేదె బీమా కోసం కమిషన్​ను ఆశ్రయించిన మహిళ
author img

By

Published : May 31, 2021, 12:49 PM IST

consumer commission: గేదె బీమా కోసం కమిషన్​ను ఆశ్రయించిన మహిళ

భూపాలపల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండలం ఖైలాపూర్‌కు చెందిన దివ్యాంగురాలు కుందూరు వసంత దేవి జీవనోపాధి కోసం గేదెలు కొని పాల వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ పశు బీమా పథకం కింద ఆమె గేదెలకు బీమా చేయించారు. ఆమె గేదెలకు 2019 సెప్టెంబరు 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు బీమా కోసం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ(national insurance company) నుంచి 4 వేల 753 రూపాయలు పొందింది. గేదె ప్రసవం సమయంలో మరణించింది.

చెల్లించేలా ఆదేశం

వసంత దేవి తన గేదె బీమా క్లెయిమ్ కోసం వెబ్​సైట్‌లో దరఖాస్తు, పోస్ట్‌మార్టం నివేదిక, ఇతర పత్రాలను అప్‌లోడ్ చేశారు. 69 వేల 900 రూపాయల బీమా చెల్లించేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ(national insurance company) నిరాకరించింది. లీగల్ నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించ లేదు. తనకు న్యాయం చేయాలని వసంతదేవి హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్‌(consumer commission)ను ఆశ్రయించారు. బీమా సొమ్ముతోపాటు, తనకు మానసిక వేదన కలిగించినందుకు 20 వేలు, పిటిషన్ ఖర్చుల కింద 5 వేలు చెల్లించేలా ఆదేశించాలని ఆమె కోరారు.

వాస్తవమేనని వెల్లడి

వసంతదేవి గేదెతోపాటు రాష్ట్రంలోని గేదెలన్నింటి బీమాకు ప్రభుత్వం నుంచి 22 లక్షల 70 వేల 918 రూపాయలు స్వీకరించింది వాస్తవమేనని... నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వినియోగదారుల కమిషన్‌(consumer commission)కు వివరించింది. వసంతదేవి దరఖాస్తుతోపాటు గేదె మరణ ధ్రువీకరణ పత్రం, పోస్ట్‌మార్టం నివేదిక అప్‌లోడ్‌ చేసినప్పటికీ... మృతదేహం చెవి ట్యాగ్ సమర్పించ లేదని తెలిపింది. నిబంధనల ప్రకారం చెవి ట్యాగ్ లేకపోతే బీమా సొమ్ము చెల్లించలేమని తెలిపింది. వసంతదేవి అప్‌లోడ్‌ చేసిన గేదె మృత దేహంలో చెవి ట్యాగ్ స్పష్టంగా కనిపిస్తోందని వినియోగదారుల కమిషన్‌(consumer commission) పేర్కొంది. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(national insurance company) సరైన కారణాలు లేకుండానే బీమా సొమ్ము తిరస్కరించిందని కమిషన్ అభిప్రాయ పడింది.

45 రోజుల్లో పే చేయాలి

వసంతదేవికి గేదె బీమా సొమ్ము 69 వేల 900 రూపాయలతో పాటు.. మానసిక ఆందోళన సృష్టించినందుకు 15 వేలు, పిటిషన్ ఖర్చుల కింద మరో 5 వేల రూపాయలు.. 45 రోజుల్లో చెల్లించాలని నేషనల్ ఇన్సూరెన్స్(national insurance company) కంపెనీని వినియోగదారుల కమిషన్(consumer commission) ఆదేశించింది.

ఇదీ చూడండి: ఆనందయ్య మందు.. కోటయ్య మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.