కరోనా రోజురోజుకు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 60 మందికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా 1451 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా... 60 మందికి పాజిటివ్ వచ్చినట్లు వారు పేర్కొన్నారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.