జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 199 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. 1,460 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేశాామని తెలిపారు. సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని... ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జిల్లాలో సోమవారం 6,087 మందికి టీకా ఇచ్చినట్లు వెల్లడించారు. 12 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సింగరేణి ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్-86 మంది, 60 ఏళ్లు పైబడిన వారు 2,595 మంది, 45-50 ఏళ్లు కలిగిన 3,406 మందికి టీకాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎవరికీ అనారోగ్య సమస్యలు తలెత్తలేదని జిల్లా వైద్యాధికారి సుధార్ సింగ్, మమతాదేవి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వాతావరణ మార్పులతో ముసురుతున్న ముప్పు!